బఫెట్ 50 వేల కోట్ల విరాళం

వారెన్ బఫెట్ మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. ఇప్పటికే వేలాది కోట్ల రూపాయలు విరాళంగా అందించిన ఆయన, తాజాగా బర్క్‌షైర్ హాథవేలో 5.3 బిలియన్ డాలర్ల విలువైన షేర్లను పలు చారిటబుల్ ట్రస్ట్‌లకు విరాళంగా అందిస్తున్నట్లు ప్రకటించారు. 2006 నుంచి ఇప్పటి వరకు 57 బిలియన్ డాలర్ల విలువైన సంపదను ఆయన విరాళంగా అందించారు.