డ్రోన్ ద్వారా డెలివరీ చేయనున్న వాల్ మార్ట్
కోవిడ్-19 కారణంగా ప్రజలు అందరు డోర్ డెలివరీ కి మొగ్గుచూపడం తో ప్రముఖ రిటైలర్ సంస్థ వాల్ మార్ట్ పై వాల్ మార్ట్ వినియోగదారులు డ్రోన్ ద్వారా డోర్ డెలివరీ చైయమని వత్తిడి తేవడం తో పెరుగుతున్న వినియోగదారుల వత్తిడి తో బుధవారం 9 సెప్టెంబర్ నుంచి ఫఎట్టేవిల్లే, నార్త్ కరోలినా లో వాల్ మార్ట్ డ్రోన్ ద్వారా డోర్ డెలివరీ చేయనున్నట్లు వాల్‌మార్ట్ ప్రకటించింది. ఎండ్-టు-ఎండ్ డ్రోన్ డెలివరీ సంస్థ ఫ్లైట్రెక్స్ తో కలిసి వాల్‌మార్ట్ ఈ ప్రక్రియను అమలు చేయనుంది.
వాల్ మార్ట్ కస్టమర్ ప్రొడక్ట్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ టామ్ వర్డ్ బ్లాగ్ పోస్ట్‌లో ఫ్లైట్రెక్స్ యొక్క ఆటోమేటెడ్ డ్రోన్లను ఉపయోగించి వాల్‌మార్ట్ దుకాణాల నుండి ఐదు పౌండ్లు వరకు వినియోగదారులు ఎంచుకున్న కిరాణా మరియు గృహ అవసరమైన వస్తువులను వాల్‌మార్ట్ డోర్ డెలివరీ చేయనున్నట్లు అంతే కాక పికింగ్ మరియు ప్యాకింగ్ నుండి టేకాఫ్ మరియు డెలివరీ వరకు వినియోగదారుల విలువైన నమ్మకాన్ని పొందడానికి స్మార్ట్ మరియు సులభమైన కంట్రోల్ డాష్‌బోర్డ్‌ను ఉపయోగించి క్లౌడ్‌పై నియంత్రించబడే డ్రోన్లు ఉపయోగించబడుతున్నాయి అని తెలిపారు.






