హెచ్డీఎఫ్సీ కి భారీ షాక్
ప్రైవేట్ రంగ బ్యాంకు అయిన హెచ్డీఎఫ్సీ బ్యాంకుకు భారీ షాక్ తగిలింది. అమెరికాకు చెందిన న్యాయ సంస్థ రోసన్ లా కంపెనీ బ్యాంకుపై క్లాస్యాక్షన్ వ్యాజ్యం దాఖలు చేసింది. పొటెన్షియల్ సెక్యూరిటీ క్లెయిమ్స్ పై షేరు హోల్డర్స్ తరపున విచారణ ప్రారంభించినట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలియజేసింది. నిజానికి దాచిపెట్టినట్లు ఆరోపణల నేపథ్యంలో దర్యాప్తునకు ఆదేశించినట్లు సంస్థ తెలిపింది. ఈ బ్యాంకు సెక్యూరిటీలను కొనుగోలు చేసిన వాటాదారులు కూడా దీనికి మద్దతు పలకాలంటూ కోరింది. తమ ఫిర్యాదును నమోదు చేయాల్సిందిగా ఒక వెబ్సైట్ సమాచారాన్ని అందించింది.హెచ్డీఎఫ్సీ వాహన ఫైనాన్సింగ్ విభాగంలో తప్పుడు విధానంపై దర్యాప్తు జరిపినట్లు జులై 13న బ్యాంకు నివేదించిన కొద్ది రోజుల తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది.
వాహన రుణాల టార్గెట్ను రీచ్ అయ్యేందుకు తప్పుడు విధానాలు అవలంభించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై దర్యాప్తు చేసిన బ్యాంకు ఆరుగు సీనియర్, మధ్యస్థాయి అధికారులను తొలగించింది. అయితే దీనిపై క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఎక్స్ పీరియన్ కూడా బ్యాంకుపై గత నెలలో రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేసింది. బ్యాంకు నుంచి లోన్లు తీసుకున్న లక్షల మంది కస్టమర్ల వివరాలతో పాటు వారి పేమెంట్ హిస్టరీ కూడా ఆలస్యంగా ఇస్తుందని ఈ ఫిర్యాదులో పేర్కొంది.






