మరోసారి వడ్డీ రేటు పెంచిన అమెరికా ఫెడ్
అమెరికా ఫెడరల్ రిజర్వు మరోసారి వడ్డీ రెట్లను పెంచింది. పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు కఠిన నిర్ణయాలు తప్పవని ఫెడ్ చైర్మన్ జెరోమ్ పాలెల్ అన్నారు. 0.75 శాతం మేరకు వడ్డీ రేటును పెంచుతూ ఆయన నిర్ణయం తీసుకున్నారు. దీంతో వడ్డీ రేటు మొత్తంగా 3`3.25 శాతానికి పెరిగింది. అయితే ఈ ఏడాది చివరి నాటికి వడ్డీ రేటును 4.40 శాతానికి పెంచే అవకాశముందని అంచనా వేస్తున్నారు. ద్రవ్యోబల్బణం కట్టడిలో భాగంగా వచ్చే సంవత్సరంలో ఈ వడ్డీ రేటు 4.60 శాతానికి పెరగొచ్చని చెబుతున్నారు. 2023 సంవత్సరానికి వృద్ధి రేటు అంచనా 1.2 శాతం ఉంటుంది. 2022లో నిరుద్యోగం రేటు 3.8 శాతానికి పెరగనుందని, 2023 లో ఇది 4.4 శాతానికి చేరనుందని ఫెడ్ ప్రకటించింది.






