డబుల్ ఈగల్ నాణేనికి… రూ.142 కోట్లు!

అమెరికా బంగారు నాణెం డబుల్ ఈగల్ కు వేలంలో రికార్డు స్థాయిలో రూ.142 కోట్ల ధర పలికింది. ఫ్యాషన్ డిజైనర్ స్టువార్ట్ వీట్టమన్‍కు చెందిన ఈ నాణేన్ని వేలం వేశారు. 20 డాలర్ల ఈ బంగారు నాణేలను 1933లో తయారు చేసినా, తీవ్ర ఆర్థిక మంద్యాన్ని దృష్టిలో పెట్టుకొని అప్పటి అమెరికా అధ్యక్షుడు రూజ్‍వెల్ట్ డబుల్ ఈగల్ నాణేలను చలామాణికి విడుదల చేయకుండా ఆపేశారు. నాణేలను కరిగించమని ఆదేశించారు. అప్పుడు బయటికి వచ్చి రెండింటిలో ఇదొకటి. డబుల్ ఈగిల్‍పై ఒకవైపు లేడీ లిబర్టీ, రెండోవైపు అమెరికన్ ఈగిల్ బొమ్మలు ముద్రించి ఉన్నాయి. 1794కు చెందిన ఫ్లోయింగ్ హెయిర్ వెండి నాణేం 2013లో 73 కోట్లకు అమ్ముడుపోయి అత్యధిక ధర పలికిన నాణేంగా రికార్డులెక్కింది. డబుల్ ఈగిల్ రూ.142 కోట్లు పలికి ఈ రికార్డును తిరగరాసింది.