ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ..నియామకాల్లో వివక్ష
ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌పై వివక్ష ఆరోపణలతో అమెరికా కోర్టులో దావా దాఖలైంది. నియామక ప్రక్రియలో వయసు, జాతీయత, లింగభేదం అంశాల్లో కంపెనీ వివక్ష చూపుతోందని ఇన్ఫోసిస్ మాజీ ఎగ్జిక్యూటివ్ జిల్ ప్రిజీన్ ఆరోపణలు చేశారు. పిల్లలు గల భారత సంతతి మహిళలను 50 ఏళ్లు దాటిన వారిని నియమించరాదని తనకు సూచించారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిసింది. ఇన్ఫోసిస్ ప్రతిభా వ్యవహారాల విభాగం ఉపాధ్యక్షురాలిగా ఆమె పని చేశారు. ఈ సంస్కృతిని మార్చేందుకు ప్రయత్నించానని, కంపెనీ భాగస్వాములు అడ్డుకున్నారని ఆరోపించారు. ఈ ఆరోపణలను కొట్టివేయాలని ఇన్ఫోసిస్ ప్రతిభా వ్యవహారాల విభాగం ఉపాధ్యక్షురాలిగా ఆమె పని చేశారు. ఈ సంస్కృతిని మార్చేందుకు ప్రయత్నించానని, కంపెనీ భాగస్వాములు అడ్డుకున్నారని ఆరోపించారు. ఈ ఆరోపణలను కొట్టివేయాలని ఇన్నోసిస్ దాఖలు చేసిన దరఖాస్తును కోర్టు తిరస్కరించింది.






