హైదరాబాద్ లో పనట్టోని లాజిస్టిక్ పార్క్!
అమెరికాకు చెందిన ఇండస్ట్రియల్, లాజిస్టిక్స్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ దిగ్గజం పనట్టోని హైదరాబాద్లో ఓ ఇండస్ట్రీయల్, లాజిస్టిక్స్ పార్కును ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ పార్కు కోసం భూముల సమీకరణలో సంస్థ నిమగ్నమైంది కూడా. ఇందులో భాగంగానే భూ యజమానులతో కంపెనీ వర్గాలు చర్చల్ని కూడా జరుపుతున్నట్టు తెలుస్తున్నది. దాదాపు 50`100 ఎకరాల్లో ఈ ఇండస్ట్రియల్, లాజిస్టిక్స్ పార్కు రావచ్చని సమాచారం. ఈ క్రమంలో రూ.400కోట్ల వరకు పెట్టుబడుల్ని పనట్టోని పెట్టనున్నది. పెట్టుబడుల కోసం విదేశీ సంస్థాగత మదుపరులనూ సంప్రదిస్తున్నది.
తొలి దశ కింద దేశంలోని ప్రధాన నగరాల్లో నాలుగు ఇండస్ట్రియల్, లాజిస్టిక్స్ పార్కులను ఏర్పాటు చేయాలని పనట్టోని ప్రయత్నిస్తున్నది. ఇందుకోసం రూ1,597 కోట్ల (200 మిలియన్ డాలర్లు) పెట్టుబడి పెట్టనుంది. ఇందుకోసం 250 ఎకరాల స్థలాన్ని అన్వేషించే పనిలో ఉంది. ఇప్పటికే ఢల్లీి`ఎన్సీఆర్, ముంబయి, చెన్నై, హైదరాబాద్, బెంగళూరులలో కొంత మంది స్థల యజమానులతో చర్చలు జరుపుతున్నట్లు సంస్థ తెలిపింది. గిడ్డంగులకు గిరాకీ పెరుగుతున్నందున, లాజిస్టిక్స్ వృద్ధికి అధిక అవకాశాలున్నాయని భావించి పెట్టుబడులు పెడుతున్నట్టు పనాటోని ఇండియా డెవలప్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ సందీప్ చందా తెలిపారు.






