పారిస్‌లోని గాలరీలపాయెట్ లో యూపీఐ సేవలు

పారిస్‌లోని ప్రముఖ షాపింగ్ మాల్ గాలరీ లఫాయెట్ లో యూపీఐ సేవలు ప్రారంభమయ్యాయి. ఈ విషయాన్ని ఫ్రాన్స్‌లోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. గతంలో ఐఫిల్ టవర్‌లో విజయవంతంగా యూపీఐ సేవలను ప్రారంభించాం. ఇప్పుడు పరిధి పెరిగింది. ప్రపంచ ప్రసిద్ధి చెందిన గాలరీ లఫాయెట్‌లోనూ యూపీఐ లావాదేవీలు ప్రారంభమయ్యాయి అని రాయబార కార్యాలయం పేర్కొంది. ప్రఖ్యాత ఐఫిల్ టవర్‌ను సందర్శించే పర్యాటకులు యూపీఐ ద్వారా రుసుమును చెల్లించే సౌలభ్యాన్ని ఫిబ్రవరి 2న భారత్ ప్రారంభించిన సంగతి తెలిసిందే.