టిక్‌టాక్ పై ట్విట్టర్ కన్ను!
భారత్, అమెరికాలలో నిషేధానికి గురయిన టిక్‌టాక్ యాప్‌పై మైక్రోబ్లాగింగ్ దిగ్గజం ట్విట్టర్ కన్నుపడింది. అమెరికాలో కార్యకలాపాల కోసం టిక్‌టాక్ కొనుగోలు ఆసక్తిని టిక్‌టాక్ మాతృసంస్థ బైట్‌డ్యాన్స్‌కు ట్విట్టర్ తెలియజేసిందని ఈ వ్యవహారంతో సంబంధమున్న ఇద్దరు వ్యక్తులు తెలియజేశారు. అయితే మైక్రోసాఫ్ట్‌తో పోటీపడి టిక్‌టాక్‌ను కొనుగోలు చేయగలిగే సత్తా ట్విట్టర్‌కు ఉందా అని నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. టిక్‌టాక్‌పై నిషేధం అమల్లోకి రావడానికి ఇంకా 45 రోజుల సమయం మాత్రమే మిగిలివుంది. ఈ స్వల్ప వ్యవధిలో మైక్రోసాఫ్ట్ కంటే ఎక్కువ మొత్తంలో చెల్లించేందుకు ట్విట్టర్ ఒప్పందం కుదుర్చుకోవడం కష్టమనే అభిప్రాయలు వ్యక్తమవుతున్నాయి.






