ట్విట్టర్ ఉద్యోగులకు ఝలక్… మరోసారి
ప్రముఖ మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ తమ ఉద్యోగులకు మరోసారి రaలక్ ఇచ్చింది. ఇప్పటికే భారీగా లేఆఫ్స్ ప్రకటించిన సంస్థ, తాజాగా మరోసారి ఉద్యోగులను పీకేసింది. సుమారు 200 మందికి లేఆఫ్స్ ప్రకటించింది. ఇది ట్విట్టర్ మొత్తం వర్క్‌ఫోర్స్‌లో 10 శాతం. కాగా ఉద్యోగాలు పోయిన వారిలో ప్రొడక్ట్ మేనేజర్లు, డేటా సైంటిస్టులు, మెషీన్ లెర్నింగ్‌పై పనిచేసే ఇంజీనీర్లు ఉన్నట్లు ఈ వ్యహారం గురించి తెలిసిన కొందరు వ్యక్తులు తెలిపారు. ఉద్యోగం నుంచి తమను తొలగించినట్టు ఈ మెయిల్స్ వచ్చాయని కొందరు ట్విట్టర్ ఉద్యోగులు తెలిపారు. కాగా, 2022 నవంబర్‌లో ఇక లేఆఫ్స్ ఉండవని ట్విట్టర్ న్యూ బాస్ మస్క్ స్పష్టం చేశారు. అయితే, అందుకు విరుద్ధంగా మస్క్ ప్రవరిస్తున్నారు.






