ఉద్యోగులకు ట్విటర్ షాక్.. మరో 4400 మందిని!!
ఎలన్ మస్క్ నేతృత్వంలో ట్విటర్లో ఉద్యోగుల లేఆప్ కొనసాగుతోంది. ఈ సంస్థను తన చేతుల్లోకి తీసుకున్న వారానికే ట్విటర్లో దాదాపు సగం మంది ఉద్యోగులకు మస్క్ ఉద్వాసన పలికిన విషయం తెలిసిందే. తాజాగా ఔట్సోర్సింగ్ విభాగంలోనూ కోతలు పెట్టినట్లు తెలుస్తోంది.ఈ విభాగంలో 5500 మంది కాంట్రాక్టు ఉద్యోగులుండగా, వీరిలో 4400 మంది ట్విటర్ తొలగించినట్లు తెలిసింది. వీరికి ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే ఇంటికి పంపించినట్లు సమాచారం. కంపెనీ ఈ-మెయిల్, ఇంటర్నల్ కమ్యూనికేషన్ సిస్టమ్స్‌తో ఉద్యోగులు యాక్సెస్ కోల్పోయిన తర్వాతే తాము లేఆఫ్‌లకు గురైనట్లు వారికి తెలిసిందట. అమెరికా సహా ఇతర దేశాల్లోని ట్విటర్ ఆఫీసుల్లో ఈ లేఆఫ్‌లు ఉన్నట్లు తెలిసింది. ట్విటర్‌కు చెందిన కంటెంట్ మాడరేషన్, రియల్ ఎస్టేట్, మార్కెటింగ్, ఇంజీనిరింగ్, ఇతర విభాగాల్లోని ఔట్సోర్సింగ్ ఉద్యోగులను విధుల నుంచి తీసేశారు. వీరిని తొలగించినట్లు కాంట్రాక్టర్లకు ఈమెయిల్ ద్వారా సమాచారమిచ్చిరట. అయితే తాజా కోతలపై ట్విటర్ నుంచి గానీ, ఎలాన్ మస్క్ నుంచి గానీ అధికారిక ప్రకటనేది రాలేదు.






