ఆహార అభిరుచుల కోసం ట్విట్టర్ ప్రత్యేక ఫీచర్
భారతీయులు తమ ఆహార అభిరుచులను పంచుకుని, వాటిపై చర్చించేందుకు చూజ్ యువర్ ఫీడ్ పేరిట ప్రత్యేక ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చినట్టు ట్విట్టర్ వెల్లడించింది. తమ వినియోగదారులు చూజ్ యువర్ ఫీడ్ హ్యాష్ ట్యాగ్‌ను వినియోగించి, తమ ఫేవరెట్ ఫుడ్ టాపిక్‌ను ప్రారంభించి దాన్ని ఇతరులతో పంచుకోవచ్చని, ఇతరుల అభిప్రాయాలను తెలుసుకోవచ్చని వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా పేరున్న సెలబ్రిటీ చెఫ్‌లు థామస్ జాక్, మారియా గోరెట్టి, ప్రతీక్ సాధు, కెల్విన్ చుంగ్, రణవీర్ బ్రార్ తదితరుల సూచనలు అందుకోవచ్చని తెలిపింది.






