ట్విట్టర్ కు ఎలన్ మాస్క్ తాజా ఆఫర్ … ఆ వివరాలిస్తే
అసలు ఖాతాలపై స్పష్టతనిస్తూ దానికి సంబంధించిన ఆధారాలు చూపిస్తే 44 బిలియన్ డాలర్లకు కొనుగోలు ఒప్పందంపై ముందుకు వెళతామని ఎలన్ మాస్క్ ట్విట్టర్ యాజమాన్యానికి సరికొత్త ప్రతిపాదన చేశారు. అందుకోసం ఆయన ఓ ప్రతిపాదన చేశారు. కనీసం వంద అక్కౌంట్లను పరిశీలించి, వాటిలో అసలైన ఖాతాలు ఎన్నో పసిగట్టడం ద్వారా ట్విట్టర్ ఖాతాల విశ్వసనీయతను పరీక్షించాలని అనుకుంటున్నట్లు మస్క్ పేర్కొన్నారు. తన ప్రతిపాదనను ట్విట్టర్ చేశారు. ఒక వేళ ఆ వంద అకౌంట్లలో నకిలీ ఖాతాలున్నట్లు తేలితే ఒప్పందానికి స్వస్తి చెబుతామని వెల్లడించారు. ఒక ట్విట్టరాటీ వేసిన ప్రశ్నకు ఆయన స్పందిస్తూ తన అభిప్రాయాన్ని పోస్టు చేశారు. దీనిపై స్పందించడానికి ఆ సామాజిక దిగ్గజం నిరాకరించింది. కొనుగోలు ఒప్పందంపై మస్క్ వెనక్కు తగ్గిన నేపథ్యంలో ట్విట్టర్ కోర్టును ఆశ్రయించింది.






