టిక్‌టాక్ కు డెడ్ లైన్..
చైనాకు చెందిన ప్రముఖ వీడియో షేరింగ్ సోషల్ నెట్ వర్కింగ్ ప్లాట్‌పాం టిక్‌టాక్ నిషేధం గడువుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫైనల్ అల్టి మేం జారీ చేశారు. టిక్‌టాక్ యాప్ కొనుగోలు వ్యవహారాన్ని సెప్టెంబరు 15లోపు పూర్తి చేసుకోవాలని, లేదంటే నిషేధమేనని తేల్చి చెప్పారు. ఇప్పటికే ఒకసారి గడువు డెడ్ లైన్ పెంచిన ట్రంప్ ఇకపై ఈ గడువు పెంచే ప్రసక్తే లేదని సృష్టం చేశారు. టిక్‌టాక్‌ను ఒక అమెరికన్ కంపెనికి విక్రయిస్తారా? లేదా మూసివేస్తారా తేల్చుకోవాలని ట్రంప్ ప్రకటించారు. అమెరికా కంపెనీ యాజమాన్యంలోని లేని టిక్‌టాక్‌ను భద్రతా కారణాల దృష్ట్యా నిషేధిస్తామని ట్రంప్ వెల్లడించారు. తాజా పరిణామంపై మైక్రోసాఫ్ట్, ఒరాకిల్, టిక్‌టాక్ స్పందించాల్సి ఉంది.






