Trump : ఆర్థిక మాంద్యం భయాలను కొట్టిపారేసిన ట్రంప్

అధ్యక్షుడు ట్రంప్ (Trump) దూకుడుతో అమెరికా ఆర్థిక వ్యవస్థ బ్రీపతికూలతలను ఎదుర్కొంటోంది. గతవారం స్టాక్ మార్కెట్లు (Stock markets ) భారీగా నష్టపోయియాయి. ద్రవ్యోల్బణం ప్రభావంతో ఇప్పటికే వినియోగం తగ్గింది. గత నెలలో అమెరికా వినిమయ మార్కెట్ రెండేళ్ల కనిష్థానికి పతనమైంది. సుంకాలు పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తే ధరలు మరింత పెరుగుతాయనే భయాలు నెలకొన్నాయి. ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగుల తొలగింపులు ఆర్థిక ఆనిశ్చితికి కారణంగా నిలుస్తున్నాయి.
ఈ ఏడాతి తొలి త్రైమాసికంలో అమెరికా వృద్ధి రేటు 2.4 శాతానికి తగ్గొచ్చని ఆర్థిక నిపుణులు (Financial experts) అంచనా వేస్తున్నారు. అయినా ట్రంప్ తగ్గేదే లేదంటున్నారు. సుంకాల కారణంగా ధరలు పెరుగుతాయనే ఆందోళనలను తోసిపుచ్చారు. అంతిమంగా అమెరికాకు లబ్ది చేకూరుతుందని చెప్పారు. దీనిపై ట్రంప్ స్పందించారు. ఆర్థిక మాంద్యం తలెత్తే అవకాశం ఉందా అన్న ప్రశ్నకు ఇలాంటి అంచనాలను తాను ఇష్టపడనని చెప్పారు. ఎన్నో సంస్కరణలు చేపడుతున్నామన్న ఆయన, అమెరికా (America)లోకి సంపదను తిరిగి తీసుకొచ్చేందుకు ప్రత్నిస్తున్నామని చెప్పారు.