టిక్‌టాక్ ఒప్పందం ఖరారుకు బైట్‌డ్యాన్స్ కసరత్తు
పాపులవర్ వీడియో యాప్ టిక్‌టాక్ మాతృసంస్థ బైట్‌డ్యాన్స్ అమెరికాలో కార్యకలాపాలను కొనసాగించాలని భావిస్తున్న నేపథ్యంలో ఒరాకిల్, వాల్‌మార్ట్‌తో డీల్‌ను పూర్తి చేయాలనుకుంటోంది. ఈ నేపథ్యంలో చైనీస్ టెక్నాలజీ ఎగుమతి లెసెన్స్ కోసం దరఖాస్తు చేసింది. అమెరికా కంపెనీలకు టిక్‌టాక్‌ను విక్రయించాలని అగ్రరాజ్యం నుంచి ఆదేశాలు వచ్చిన నేపథ్యంలో అప్రమత్తమైన చైనా.. టెక్నాలజీ ఎగుమతులపై నియంత్రణను మరింత కట్టుదిట్టం చేసింది. అమెరికా నుంచి ఒత్తిడి పెరుగుతున్నందున ఒరాకిల్, వాల్‌మార్ట్‌లతో ఒప్పందానికి టిక్‌టాక్ సన్నద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో దరఖాస్తు చేసినట్టు బైట్‌డ్యాన్స్ తెలిపింది.






