బెజోస్ కు షాక్.. మళ్లీ ఆయనే నంబర్ వన్
టెస్లా చీఫ్ ఎలన్ మస్క్ మరోసారి జెఫ్ బెజోస్‌ను పక్కకునెట్టి ప్రపంచంలో అత్యంత సంపన్నుడిగా నిలిచాడు. మస్క్ నికర ఆస్తుల విలువ 930 కోట్ల డాలర్లు ఎగిసి 19900 కోట్ల డాలర్లకు చేరవడంతో బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్‌లో టాప్ ప్లేస్ దక్కించుకున్నారు. మస్క్ రాకెట్ కంపెనీ స్పేస్ఎక్స్ మరో విడత నిధుల సమీకరణను పూర్తిచేయడం ఆయనకు కలిసి వచ్చింది. ఇక అమెజాన్ అధిపతి జెఫ్ బెజోస్ నికర ఆస్తులు మస్క్ సంపదతో పోలిస్తే 600 కోట్ల డాలర్లు తక్కువగా 19420 కోట్ల డాలర్లుగా నమోదయ్యాయి. టెస్లా షేర్లు ఇటీవల విపరీతంగా పెరగడంతో నికర ఆస్తుల విలువలో బెజోస్‌ను మస్క్ అధిగించారు. ఇక మస్ కంపెనీ స్పేస్ఎక్స్ గతవారం మరోవిడత ఈక్విటీ ఫండింగ్ రౌండ్‌ను పూర్తి చేసుకోవడంతో కంపెనీ విలువ 7400 కోట్ల డాలర్లకు ఎగబాకింది.






