ప్రపంచంలోనే టీసీఎస్ అగ్రస్థానం
టీసీఎస్ ప్రపంచంలోనే అత్యంత విలువైన ఐటీ సేవల సంస్థగా అవతరించింది. యాక్సెంచర్కు వెనక్కి నెట్టి ఈ ఘనత సాధించింది. గురువారం టీసీఎస్ షేరు దూకుడుతో సంస్థ మార్కెట్ విలువ రూ.10,59,973,63 కోట్లకు చేరింది. డాలర్లలో ఈ విలువ 144.73 బిలియన్ డాలర్లు. ప్రస్తుతం యాక్సెంచర్ మార్కెట్ విలువ 142.4 బి.డాలర్లుగా ఉంది. దీంతో మార్కెట్ విలువపరంగా ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగంలో టీసీఎస్ అగ్రస్థానానికి దూసుకెళ్లగా యాక్చెంచర్ రెండో స్థానానికి దిగివచ్చింది. 110.5 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువతో ఐబీఎం మూడో స్థానంలో ఉంది.






