ఢిల్లీ, ముంబైల నుంచి లండన్ కు నేరుగా స్పైస్‌జెట్
దేశీయ విమానయాన సంస్థ స్పైస్‌జెట్ డిసెంబర్ 4 నుంచి లండన్‌కు విమాన సర్వీసును ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. బ్రిటన్‌తో కుదుర్చుకున్న ఎయిర్ బబుల్ ఒప్పందంలో భాగంగా ఢిల్లీ, ముంబైల నుంచి లండన్‌కు విమాన సర్వీసులను మొదలుపెడుతున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఢిల్లీ-లండన్ సర్వీసును వారానికి రెండుసార్లు, ముంబై-లండన్ సర్వీసును వారానికి ఒకసారి నడుపుతామని కంపెనీ వివరించంది. ఈ సర్వీసులకు ఎయిర్‌బస్ ఏ 330-900 నియో ఎయిర్ క్రాఫ్ట్‌లను ఉపయోగించనుంది. అతి తక్కువ ఖర్చుతో ప్రయాణికులను బ్రిటన్‌కు చేరవేసే మొదటి భారతీయ సర్వీసు ఇదేనని కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ అజయ్ సింగ్ తెలిపారు. మరిన్ని దేశాలకు విమాన సర్వీసుల ప్రారంభం గురించి త్వరలోనే ప్రకటన విడుదల చేస్తామని తెలిపారు.






