టిక్‌టాక్ కొనుగోలుకు జపాన్ కంపెనీ ఆసక్తి
జపాన్‌కు చెందిన సాఫ్ట్‌బ్యాంక్ తాజాగా టిక్‌టాక్ ఇండియా వ్యాపారం కోసం ప్రయత్నిస్తోంది. దీని కోసం సాఫ్ట్‌బ్యాంక్ గ్రూప్ స్థానిక భాగస్వాముల కోసం అన్వేషిస్తోందని బ్లూమ్‌బెర్గ్ నివేదిక తెలిపింది. సాఫ్ట్ బ్యాంక్ గ్రూప్‌కు ఇప్పటికే టిక్‌టాక్ మాతృ సంస్థ బైట్ డాన్స్ లో వాటాను కలిగి ఉంది. టిక్‌టాక్ భారతీయ వ్యాపారాన్ని కొనుగోలు చేయడానికి సాఫ్ట్‌బ్యాంక్ స్థానిక భాగస్వాములతో వేలం వేయవచ్చు. బైట్‌డాన్స్ ఇటీవల టిక్‌టాక్ ఇండియా వ్యాపారం విషయమై రిలయన్స్ జియో, ఎయిర్టెల్ లిమిటెడ్‌తో చర్చలు జరిపింది. సాఫ్ట్‌బ్యాంక్ ఇప్పటికే భాగస్వామ్య అవకాశాలను అన్వేషిస్తోంది. చైనా చెందిన షార్ట్ వీడియో యాప్ టిక్‌టాక్‌ను భారత్, అమెరికా దేశాలు నిషేధించాయి.






