టిక్‌టాక్‌పై అమెరికా దిగ్గజ సంస్థ కన్ను
వివాదాస్పద చైనా ష్టార్ వీడియో షేరింగ్ ప్లాట్‌ఫామ్ టిక్‌టాక్ కొనుగోలు రేసులో అమెరికాకు చెందిన మరో దిగ్గజ సంస్థ నిలిచింది. ప్రముఖ సోషల్ వీడియో ప్లాట్‌ఫామ్ ట్రిల్లర్ చైనాకు చెందిన బైట్‌డాన్స్‌ను సంప్రదించినట్లు తెలుస్తోంది. లండన్ కేంద్రంగా పనిచేస్తున్న ప్రసిద్ధ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సంస్థ సెంట్రికన్ ద్వారా 20 బిలియన్ డాలర్ల బిడ్‌తో సంప్రదించినట్లు రాయిటర్స్ తెలిపింది. అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, భారతదేశంలోని టిక్‌టాక్ ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు యోచిస్తున్నట్లు పేర్కొంది. టిక్‌టాక్ కాకుండా టిక్‌టాక్ యా•మాన్య సంస్థ బైట్‌డాన్స్‌ను నేరుగా బిడ్చేసినట్లు ట్రిల్లర్ వెల్లడించింది. సెంట్రికన్ ద్వారా బైట్‌డాన్స్ చైర్మన్‌గా నేరుగా ఆఫర్‌ను సమర్పించామనీ, స్వీకరణ ధృవీకరణ కూడా తమకు చేరిందని ట్రిల్లర్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ బాబీ సర్నెవెస్ట్ చెప్పారు. డైరెక్టుగా చైర్మన్‌తోనే సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. అయితే ఈ వార్తలను టిక్‌టాక్ తోసిపుచ్చింది. అలాంటి ఆఫర్‌ను అందుకోలేదని తెలిపింది.దీంతో ఈ వ్యవహారంలో గందరగోళం నెలకొంది.






