శంషాబాద్ ఎయిర్పోర్టులో ఈ-బోర్డింగ్ సేవలు
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఎయిర్పోర్టులో ఈ-బోర్డింగ్ సేవలు ప్రారంభమయ్యాయి. ఎమిరేట్స్ ఎయిర్లైన్స్, జీఎంఆర్ సీఈవో ప్రదీఫ్ ఫణికఱ్తో కలిసి ఎమిరేట్స్ మేనేజర్ శేఖర్కావిడి ఈ సేవలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రదీప్ ఫణికర్ మాట్లాడుతూ అన్ని దేశీయ విమాన ప్రయాణికులకు పేపర్లెస్ ఈ-బోర్డింగ్ సేవలను అందిస్తున్న ఏకైన విమానాశ్రయం ఆర్జీఐఏ అని తెలిపారు. దుబాయ్ వెళ్లే ప్రయాణికులు ఈకే-572 విమానంలో ఎక్కడానికి ఎమిరేట్స్ ఎయిర్లెన్స్ దీనిని ఉపయోగించుకుంది. ఈ కార్యక్రమంలో జీఎంఆర్, ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ అధికారులు పాల్గొన్నారు.






