ఆదాయ పన్ను చిక్కుల్లో పాప్ స్టార్ షకీరా
అంతర్జాతీయ పాప్ గాయని షకీరా (45) ఆదాయ పన్ను ఎగవేత కేసులో జైలు శిక్షకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆదాయ పన్నుకు సంబంధించి షకీరా మోసాలకు పాల్పడినట్లు స్పెయిన్లో ఆమెపై అభియోగాలు నమోదు అయ్యాయి. షకీరాకు ఎనిమిది సంవత్సరాలకు పైగా జైలు శిక్ష విధించాలంటూ బార్సిలోనా కోర్టులో ప్రాసిక్యూటర్లు వాదనలు వినిపించారు. షకీరా 2012-14 కాలంలో రూ.116 కోట్ల మేర స్పెయిన్ ప్రభుత్వానికి ఆదాయ పన్ను ఎగవేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటోంది. కాగా తదుపరి విచారణలో షకీరా కేసులో తుది తీర్పు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.






