సీనియర్ సిటిజన్స్ కు శుభవార్త చెప్పిన కేంద్రం
75 ఏళ్లు దాటిన సీనియర్ సిటిజన్లకు ఊరట కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర బడ్జెట్ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో ప్రవేశ పెట్టారు. 75 ఏళ్లు దాటిన సీనియర్ సిటిజన్లు ఐటీ రిటర్న్ దాఖలుకు మినహాయింపు కల్పిస్తున్నట్టు ప్రకటించారు. పింఛను, వడ్డీ ఆదాయం ఆధారంగా ఐటీ మినహాయింపు కల్పిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. కేంద్రం తాజా నిర్ణయంతో పింఛను, వడ్డీతో జీవించే వారికి ఐటీ రిటర్న్ దాఖలు నుంచి మినహాయింపు లభించనుంది. ఆదాయపన్ను శ్లాబుల్లో కేంద్రం ఎలాంటి మార్పులు చేయలేదు. దీంతో పన్ను చెల్లింపు దారులను కేంద్ర బడ్జెట్ తీవ్ర నిరాశకు గురిచేసింది.






