ఎస్‍బీఐ శుభవార్త… నేటి నుంచి కొత్త

దేశీయ అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకింగ్ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‍బీఐ) శుభవార్త అందజేసింది. గృహ రుణాలపై వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. గృహ రుణాలనున తీసుకునే వారికి 6.70 శాతం నుండి వడ్డీ రేట్లు ప్రారంభం కానున్నట్లు పేర్కొంది. అంతేకాకుండా మహిళా రుణ గ్రహీతలకు మరో ఐదు బేసిన్ పాయింట్ల వరకు రాయితీని ఇవ్వనున్నట్లు తెలిపింది. ఖాతాదారులు యోనో యాప్ నుంచి గృహరుణాలను పొందవచ్చునని, అలా తీసుకున్న వారికి మరో 5 బేసిస్ పాయింట్ల వరకు వడ్డీరేటును తగ్గిస్తామని తెలిపింది. నేటి నుంచి కొత్త రేట్లు అమల్లోకి రానున్నట్లు వెల్లడించింది. గృహ రుణ వడ్డీ రేట్లు రూ.30 లక్షలకు 6.70 శాతం, రూ.30 లక్షల నుంచి రూ.75 లక్షల వరకు 6.95 శాతం, రూ.75 లక్షలకు పైగా రుణాలను తీసుకునే వారికి 7.05 శాతం వద్ద గృహ రుణాలు లభిస్తాయని ప్రకటించింది.
బ్యాంకు గృహ రుణ పోర్ట్ పోలియో రూ.5 లక్షల కోట్ల మైలు రాయిని ఫిబ్రవరిలోనే చేరిందని ఎస్‍బీఐ తెలిపింది. దీన్ని రానున్న ఐదేళ్లలో రూ.10 లక్షల కోట్లకు చేర్చడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఎస్‍బీఐ తెలిపింది. 2024 ఆర్థిక సంవత్సరం నాటికి ఇది రూ.7 లక్షల కోట్లకు చేరే అవకాశం ఉందని అంచనా వేసింది. బ్యాంకు డిపాజిట్ బేస్ రూ.35 లక్షల కోట్లు ఉండదని తెలిపింది. ఈ సందర్భంగా సంస్థ ఎండీ సీఎస్ శెట్టి మాట్లాడుతూ ఎస్‍బీఐ హోమ్ ఫైనాన్స్లో మార్కెట్ లీడర్‍గా ఉంటూ, గృహ రుణ మార్కెట్లో వినియోగదారులను సంతృప్తి పరచడానికి యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. గృహ రుణ వడ్డీ రేట్లతో ఖాతాదారులకు రుణాలను తీసుకునే స్థోమత బాగా పెరుగుతుంది. అంతేకాకుండా ఇది ఈఎంఐ మొత్తాలను గణనీయంగా తగ్గిస్తుంది. ఈ చర్యలతో రియల్ ఎస్టేట్ పరిశ్రమకు వెనుదన్నుగా నిలుస్తుందని పేర్కొన్కారు.