సౌదీ అరేబియా కీలక నిర్ణయం.. అమెరికా ఒప్పందానికి కటీఫ్

పెట్రో డాలర్లకు సంబంధించి సౌదీ అరేబియా కీలక నిర్ణయం తీసుకుంది. యాబై ఏళ్ల క్రితం (1974) దీనికి సంబంధించి అమెరికాతో కుదిరిన ఒప్పందానికి కటీఫ్ చెప్పింది. ఈ ఒప్పందం కారణంగా గత యాభై సంవత్సరాలుగా సౌదీ అరేబియా తన చమురు, చమురు ఉత్పత్తుల చెల్లింపులను అమెరికా డాలర్లలోనే అనుమతిస్తోంది. ఇందుకు ప్రతిగా అమెరికా, సౌదీ అరేబియా ప్రభుత్వానికి ఎలాంటి ముప్పు లేకుండా కాపాడుతోంది. తాజా నిర్ణయంతో దీనికి తెరపడనుంది. ఇక యూరో, జపాన్ యెన్, యువాన్ వంటి కరెన్సీలను కూడా సౌదీ అరేబియా అనుమతించే అవకాశం ఉంది. దీంతో అంతర్జాతీయ వాణిజ్యంలో అమెరికా డాలర్ ఆధిపత్యానికి తెరపడుతుందని భావిస్తున్నారు. అంతేగాక ప్రధాన కరెన్సీలతో అమెరికా డాలర్ మారకం రేటు తగ్గి, అమెరికాలో వడ్డీ రేట్లు మరింత పెరిగే అవకాశం ఉందనే అంచనాలు వెలువడుతున్నాయి.