BRIC: ట్రంప్ టారిఫ్‌లను తప్పుబట్టిన రష్యా

బ్రిక్ దేశాలు అమెరికా వ్యతిరేక విధానాలు అమలు చేస్తున్నాయని, వీటిని కొనసాగించే దేశాలపై 10 శాతం అదనపు టారిఫ్‌లు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) హెచ్చరించిన సంగతి తెలిసిందే. సరిగ్గా బ్రిక్స్ సమావేశంలో జరిగే సమయంలో వచ్చిన ఈ వార్నింగులను రష్యా (Russia) కూడా తప్పబట్టింది. ప్రపంచాన్ని ఒకేలా చూసే కొన్ని దేశాలు కలిసి, ఆయా దేశాల ప్రయోజనాల కోసం సహకరించుకునే ప్రత్యేకమైన గ్రూప్ బ్రిక్స్ అని రష్యా ప్రతినిధి డిమిత్రీ పెస్కోవ్ (Dmitry Peskov) వివరించారు. ఈ సహకారం ఎవరికీ వ్యతిరేకంగా కాదని, ఎప్పటికీ వేరే దేశాలకు వ్యతిరేకంగా బ్రిక్స్ పనిచేయదని చెప్పారు. అయితే బ్రిక్స్ దేశాలు కొన్ని అమెరికా వ్యతిరేక విధానాలను తీసుకొస్తున్నాయని, వీటిని అమలు చేసే దేశాలపై 10 శాతం అదనపు టారిఫ్‌లు వేస్తానని ట్రంప్ హెచ్చరించారు.