ఆదిత్య మ్యూజిక్ తో హైదరాబాద్ షార్ట్ వీడియో యాప్ రిజిల్ భాగస్వామ్యం
హైదరాబాద్ కు చెందిన, ఒరిజినల్ షార్ట్ వీడియో ప్లాట్ ఫామ్ అయిన రిజిల్ యాప్ నేడిక్కడ అగ్రగామి దక్షిణ భారతీయ మ్యూజిక్ కంపెనీ ఆదిత్య మ్యూజిక్ తో ఎక్స్ క్లూజివ్ మ్యూజిక్ లైసెన్సింగ్ భాగస్వామ్యాన్ని ప్రకటించింది. ఈ వర్టికల్ కంటెంట్ యాప్ ఇప్పుడు క్రియేటర్లు అందరి కోసం ఆదిత్య మ్యూజిక్ నుంచి లైసెన్స్ డ్ మ్యూజిక్ యొక్క యావత్ కేటలాగ్ ను కలిగి ఉంది.
రిజిల్ యాప్ పై 10 మిలియన్లకు పైగా కంటెంట్ క్రియేటర్లు రోజూ ఒరిజినల్, వినోదాత్మక వీడియోలను రూపొందిస్తుంటారు. రిజిల్ మరియు ఆదిత్య మ్యూజిక్ మధ్య కుదిరిన ఒప్పందం ఈ క్రియేటర్లు ప్రముఖ ప్రాంతీయ పాటలతో తమ వీడియోలను రూపొందించడంలో సహాయపడుతుంది. సృజనాత్మకతకు పేరొందిన ఎపిసోడ్స్, షార్ట్ వర్టికల్ వెబ్ సిరీస్ లకు కూడా ఇంటర్నెట్ లో రిజిల్ బాగా పేరొందింది.
ఈ సందర్భంగా రిజిల్ సహ వ్యవస్థాపకులు లక్ష్మినాథ్ దొండేటి మాట్లాడుతూ, ‘‘ఆదిత్య మ్యూజిక్ తో రిజిల్స్ అనుబంధం మా క్రియేటర్లకు నూతన అవకాశాలను అందించింది. ఎంచుకునేందుకు విస్తృత శ్రేణి లైసెన్స్ డ్ మ్యూజిక్ ట్రాక్ లతో సృజనరంగం ఇప్పుడు మరింత వైవిధ్యభరితమైందిగా, అందమైంది గా మారింది. ఈ భాగస్వామ్యం మాకెంతో ఆనందదాయకం’’ అని అన్నారు.
ఆదిత్య మ్యూజిక్ సంస్థ పరిశ్రమకు చెందిన ప్రముఖ సంస్థలతో కలసిపని చేస్తోంది. అల్లు అర్జున్, మహేశ్ బాబు, పూజా హెగ్డే, పవన్ కల్యాణ్ లతో సహా ప్రముఖ నటులతో పని చేసింది. ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంది. సంగీత ప్రపంచంలో 40 ఏళ్ల వారసత్వాన్ని ఈ సంస్థ కలిగిఉంది. ఈ ఎక్స్ క్లూజివ్ ఒప్పందంతో ఇది మరింత మెరుగుకానుంది.
ఈ సందర్భంగా ఆదిత్య మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ ఆదిత్య గుప్తా మాట్లాడుతూ, ‘‘రిజిల్ యాప్ తో భాగస్వామ్యం మాకెంతో ఆనందదాయకం. క్రియేటర్లు, సంగీత ప్రేమికులు, అభిమానులు తమ ప్రతిభను ప్రదర్శించేందుకు ఇది ఒక చట్టబద్ధమైన మరియు బ్రాండెడ్ వేదికను అందిస్తుంది. బాలీవుడ్ తరువాత విడుదల అయ్యే సినిమాల సంఖ్య, స్టూడియోలు, థియేటర్లు, నటులు, మరీ ముఖ్యంగా సూపర్ స్టార్లు ఎక్కువగా ఉన్నది టాలీవుడ్ లోనే. ఈ పరిశ్రమలో తారల పట్ల అభిమానులకు గల క్రేజీ అందరికీ తెలిసిందే’’ అని అన్నారు.
ఆదిత్య మ్యూజిక్ తో కలసి ఈ బ్రాండ్ యాప్ పై వీడియో తయారీని దక్షిణాది క్రియేటర్లకు మరింత వినోదాత్మకం చేయనుంది. ఆదిత్య మ్యూజిక్ కు తోడుగా, రిజిల్ ఇటీవలే అమెరికాకు చెందిన మ్యూజిక్ లైసెన్సింగ్ సంస్థ అయిన సౌండ్ స్ట్రిప్ తో ఓ అంతర్జాతీయ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. రాయల్టీ ఫ్రీ ఇంగ్లీష్ మ్యూజిక్ సంపూర్ణ కేటలాగ్ ను ఆ సంస్థ ఇంటిగ్రేట్ చేస్తుంది.






