శంషాబాద్ ఎయిర్‌పోర్టు కు ఏసీఐ అవార్డు
జీఎమ్మార్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి గతేడాదికిగాను ప్రతిష్టాత్మక ఏసీఐ (ఎయిర్‌పోర్టు కౌన్సిల్ ఇంటర్నేషనల్), ఏఎస్‌క్యూ (ఎయిర్‌పోర్టు సర్వీస్ క్యాలిటీ) అవార్డు దక్కింది. ఆసియా-పసిఫిక్ దేశాల్లో గల 15-25 మిలియన్ ప్యాసింజర్స్ (ఎంపిపిఏ) విభాగంలోని ఎయిర్‌పోర్టుల్లో శంషాబాద్ ఎయిర్‌పోర్టు 2020 ఉత్తమ విమానాశ్రయ గుర్తింపు అందుకున్నట్లు జీఎమ్మార్ వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి. ఏఎస్‌క్యూ అనేది విమానయాన సేవలు, ప్రయాణీకుల సంతృప్తికి కొలమానం. దీంతో ఏసీఐ నిర్వహించిన ఏఎస్‌క్యూ సర్వేలో ఉత్తమ అవార్డు రావడం పట్ల ఎయిర్‌పోర్టు సీఈవో ప్రదీప్ ఫణికర్ ఆనందం వ్యక్తం చేశారు. తమకెంతో గర్వంగా ఉందన్నారు.






