Geo: జియో యూజర్లకు గుడ్‌న్యూస్ .. ఈ ప్లాన్లపై

ప్రముఖ టెలికాం సంస్థ జియో తమ యూజర్లకు ఉచితంగా ఏఐ క్లౌడ్ స్టోరేజీని అందిస్తోంది. ఎంపిక చేసిన ప్రీపెయిడ్ (Prepaid), పోస్ట్‌పెయిడ్ (postpaid) ప్లాన్లపై 50 జీబీ క్లౌడ్ స్టోరేజీని ఉచితంగా ఇస్తోంది. గతేడాది జరిగిన రిలయన్స్ ఏజీఎంలో 100 జీబీ క్లౌడ్ స్టోరేజీని ఉచితంగా అందించనున్నట్లు ముకేశ్ అంబానీ (Mukesh Ambani) ప్రకటించారు. ఇందులో భాగంగా ఎంపిక చేసిన ప్లాన్లను ఈ స్టోరేజీ అందిస్తోంది. రూ.299, అంతకంటే ఎక్కువ మొత్తంతో రీఛార్జి చేసుకున్న వారికి ఈ క్లౌడ్ స్టోరేజీని జియో అందిస్తోంది. అంతకంటే తక్కువ మొత్తం రీఛార్జి చేసిన వారికి 5 జీబీ డేటా మాత్రమే ఫ్రీ ట్రయల్ రూపంలో లభిస్తోంది. రూ.349, రూ.449, రూ.649, రూ.749, రూ.1549 పోస్ట్‌పెయిడ్ ప్లాన్లలో అంతర్భాగంగా క్లౌడ్ స్టోరేజీని ఇస్తోంది. ఇతర టెలికాం నెట్‌వర్క్ యూజర్లకూ ప్రమోషనల్ స్టోరేజీలో భాగంగా నిర్ణీత కాలంపాటు 50 బీజీ క్లౌడ్ స్టోరేజీని అందిస్తున్నట్లు జియో క్లౌడ్ (Jio Cloud) తన వెబ్‌సైట్‌లో పేర్కొంది.