రిలయన్స్ ఇండస్ట్రీస్ మరో అరుదైన ఘనత
రిలయన్స్ ఇండస్ట్రీస్ మరో అరుదైన ఘనత సాధించింది. అమెరికాకు చెందిన ఎక్సాన్ మొబిల్ను దాటేసి… ప్రపంచంలోనే రెండో అతిపెద్ద చముర సంస్థగా ఆవిర్భవించింది. ముఖ్యంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థలైన డిజిటల్, రీటైల్ వ్యాపారాలు దూకుడుగా ఉండటంతో ఈ కంపెనీ మార్కెట్ విలువ గణనీయంగా పెరిగింది. గత శుక్రవారమే కంపెనీ మార్కెట్ విలువ 189 బిలియన్ డాలర్లను తాకడంతో ఎక్సాన్ మెబిల్ను దాటేసింది. ఈ రెండింటి మధ్య బిలియన్ డాలర్ల తేడా ఉంది.
ఓ పక్క రిలయన్స్ షేరు పెరుగుతుండగా, మరోపక్క ఎక్సాన్ షేరు పడిపోతోంది. ఈ ఏడాది 39 శాతం విలువ కోల్పోయింది. చమురు డిమాండ్ తగ్గుదల రోజుకు 30 మిలియన్ బ్యారెళ్ల వరకు ఉంది. ఇది చాలా పెద్ద మొత్తం. చమురు డిమాండ్ తగ్గడమే ఎక్సాన్పై ప్రభావం చూపింది. మరోపక్క రిలయన్స్ వ్యాపార వైవిధ్యం కారణంగా పెట్రోలియం విభాగంలో లాభాలు తగ్గినా, డిజిటల్, రీటైల్ విభాగాలు కాపాడాయి. వాస్తవానికి మార్చి 31 నాటికి రిలయన్స్ ఆదాయాల్లో 80 శాతం పెట్రోలియం వ్యాపారం నుంచే వచ్చాయి.






