రిలయన్స్ ఇండస్ట్రీస్ అరుదైన ఘనత… తొలి భారతీయ కంపెనీగా

ముకేశ్ అంబానీ నేతృత్వంలోని ప్రముఖ వ్యాపార సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ మరోసారి అరుదైన ఘనత సాధించింది. మార్కెట్ విలువ పరంగా రూ.21 లక్షల కోట్లతో సరికొత్త మైలురాయిని చేరుకుంది. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ కంపెనీగా రిలయన్స్ నిలిచింది. మార్కెట్ ప్రారంభంలోనే కంపెనీ షేరు సరికొత్త గరిష్ఠాన్ని తాకింది. ఒకానొక సమయంలో కంపెనీ షేరు విలువ 1.69 శాతం ఎగబాకి రూ.3,129కి చేరుకోవడంతో మార్కెట్ విలువ పెరిగింది. దీంతో రిలయన్స్ ఈ ఘనత సొంతం చేసుకుంది.