యూఎస్ఎయిడ్ తో రిలయన్స్ ఫౌండేషన్ జట్టు
డిజిటల్ అవగాహనకు సంబంధించి మహిళలు, పురుషుల్లో అసమానతలను తగ్గించే దిశగా యూఎస్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ (యూఎస్ఎయిడ్), డబ్ల్యూ-జీడీపీతో కొత్తగా భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు రిలయన్స్ ఫౌండేషన్ వెల్లడించింది. అమెరికా అధ్యక్ష సలహాదారు ఇవాంక ట్రంప్ నిర్వహించిన ఉమెన్స్ గ్లోబల్ డెవలప్మెంట్ అండ్ ప్రాస్పరిటీ (డబ్యూ-జీడీపీ) కార్యక్రమంలో ఇది కుదిరినట్లు వివరించింది. మహిళల ఆర్థిక సాధికారత సాధనకు తోడ్పడేందుకు డబ్ల్యూ-జీడీపీ ఫండ్ ఏర్పాటైనట్లు ఇవాంక తెలిపారు. దేశ వ్యాప్తంగా డబ్ల్యూ-జీడీపీ ఉమెన్కనెక్ట్ చాలెంజ్‌ను త్వరలో నిర్వహించనున్నట్లు వర్చువల్ వీడియో సందేశం ద్వారా రిలయన్స్ ఫౌండేషన్ చైర్పర్సన్ నీతా అంబానీ తెలిపారు.






