విదేశాల్లో యుపిఐ పేమెంట్స్ కు ఒప్పందాలు
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ సౌకర్యం 2016లో అందుబాటులోకి వచ్చింది. ఆరంభంలో అడుగులు నెమ్మదిగా పడినా ఇప్పుడు యూపీఐ పేమెంట్స్ సర్వసాధారణ విషయంగా మారింది. అయితే విదేశాల్లో ఉన్న వ్యక్తులకు డబ్బులు పంపడం ఇబ్బందిగా మారింది. ఈ కష్టాలు తొలగించే దిశగా ఆర్బీఐ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. అందులో భాగంగా తొలుత జీ 20 దేశాలతో ఈ మేరకు ఒప్పందం చేసుకోవాలని అనుకుంటోంది. భారత్, సింగపూర్ దేశాల మధ్య ఆన్లైన్ చెల్లింపులకు సంబంధించి రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా, మానేటరీ అథారిటీ ఆఫ్ సింగపూర్ల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ మేరకు ఇండియాలోని యూపీఐ యూజర్లు సింగపూర్‌లో ఉన్న పే నౌ యౌజర్లతో తేలికగా ఆర్థిక లావాదేవీలు నిర్వహించేందుకు వీలు కలగనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చకచక జరుగుతున్నాయి. 2022 జులై నుంచి ఇండియా, సింగపూర్ దేశాల మధ్య యూపీఐ చెల్లింపులు ఉంటాయని భావిస్తున్నారు.






