RBI : ఆర్‌బీఐకి కొత్త డిప్యూటీ గవర్నర్

ఎన్‌సీఏఈఆర్ డైరెక్టర్ జనరల్ అయిన పూనమ్ గుప్తా (Poonam Gupta ) ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(Reserve Bank of India) డిప్యూటీ గవర్నర్ (Deputy Governor ) గా కేంద్రం నియమించింది. మూడేళ్ల పాటు ఆమె డిప్యూటీ గవర్నర్ (Governor) పదవిలో కొనసాగనున్నారు. తాజా నియామకాన్ని నియామకాల కేబినెట్ కమిటీ ఆమోదించిందని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. డిప్యూటీ గవర్నర్‌గా ఎండీ పాత్ర జనవరిలో పదవీ విరమణ చేసినప్పటి నుంచి ఆ పదవి ఖాళీగా ఉంది. ఎంపీసీ భేటీకి ముందు ఈ నియామకం జరిగింది.