విద్యుతు విమానం వచ్చేసింది!
ప్రపంచంలోనే తొలిసారిగా విద్యుత్తుతో నడిచే విమానం గాలిలో చక్కర్లు కొట్టింది. ఏవియేషన్ ఎయిర్క్రాఫ్ట్ సంస్థ తయారు చేసిన ఈ విమానం వాషింగ్టన్లోని గ్రాంట్ కౌంటీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 3,500 అడుగుల ఎత్తుకు ఎగిరింది. దాదాపు 8 నిమిషాల పాటు ఈ విమానం గాలిలో ప్రయాణించింది. మొట్టమొదటి ఉద్గారాల రహిత విమానాన్ని విజయవంతంగా నడిపించామని ఏవియేషన్ సంస్థ అధ్యక్షుడు, సీఈవో గ్రెగోరి డేవిస్ తెలిపారు. కాగా, అమెరికాకు చెందిన కేప్ ఎయిర్ 75 యూనిట్లు, గ్లోబల్ క్రాసింగ్ ఎయిర్లైన్స్ 50 యూనిట్లకు ఆర్డర్ ఇచ్చాయి. మూడు వేరియంట్లు 9 సీటర్ కమ్యూటర్, 6 సీటర్ ఎగ్జిక్యూటివ్ క్యాబిన్, ఈ కార్గోను ఏవియేషన్ కంపెనీ తయారు చేసింది.






