ప్రధాని మోదీ మరో అరుదైన ఘనత

ప్రధాని నరేంద్ర మోదీ మరో అరుదైన ఘనత అందుకున్నారు. సామాజిక మాధ్యమం ఎక్స్ (గతంలో ట్విటర్)లో తనను అనుసరించే వారి సంఖ్య 100 మిలియన్ల (10 కోట్లు) మార్కును అందుకోవడం విశేషం. దీనిపై మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఎక్స్ లాంటి వైవిధ్యమైన వేదికలో ఉండటం ఆనందంగా ఉంది. దీనిద్వారా ఎన్నో విషయాలపై చర్చలు, నిర్మాణాత్మక విమర్శలు, ప్రజల ఆశీర్వాదాలు లభిస్తున్నాయి. భవిష్యత్తులోనూ కొనసాగిస్తానని ప్రధాని మోదీ తెలిపారు. 2009లో ఆయన ట్విటర్ వినియోగించడం ప్రారంభించారు. 2020 జులై 19 నాటిక ఆయనకు ట్విటర్లో 6 కోట్ల మంది ఫాలోవర్లు ఉండగా, నాలుగేళ్లలో 4 కోట్ల మంది ఫాలోవర్లు పెరగడం గమనార్హం. ప్రస్తుత ప్రపంచ నేతల్లో ఎవరికీ ఈ స్థాయి ఆదరణ లేదు.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు ఎక్స్ లో 38.1 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను 27.5 మిలియన్ల మంది, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని 26.4 మిలయన్ల మంది అనుసరిస్తున్నారు. విరాట్ కోహ్లీ ( 64.1 మిలియన్లు), టైలర్ స్విఫ్ట్ (95.3 మిలియన్లు) కన్నా మోదీనే పాలో వర్ల విషయంలో ముందున్నారు. మోదీ ఇంత వరకు ఏ ఒక్కరినీ ఎక్స్ లో బ్లాక్ చేయలేదని అధికారులు తెలిపారు.