వేలంలో రికార్డులు బ్రేక్ చేసిన పింక్ డైమండ్
హాంకాంగ్‌లో నిర్వహించిన వేలంలో పింక్ డైమండ్ మొత్తం వేలం రికార్డులను బ్రేక్ చేసి ప్రపంచ రికార్డు సృష్టించింది. క్యారెట్‌కు అత్యధిక ధర పలికిన డైమండ్గా సరికొత్త రికార్డు సృష్టించింది. వేలం పాటలో పింక్ డైమండ్ అత్యధికంగా 49,9 మిలియన్ అమెరికన్ డాలర్లకు అమ్ముడైంది. 11.15 క్యారెట్ల పింక్ డైమండ్ వాస్తవానికి 21 మిలియన్ అమెరికా డాలర్లు విలువ ఉంటుందని అంచనా వేశారు. అయితే ఈ డైమండ్ 392 మిలియన్ హాంకాంగ్ డాలర్లుకు అమ్ముడైంది. ఈ మొత్తం 49.9 మిలియన్ అమెరికన్ డాలర్లతో సమానం. దీంతో విలియమ్సన్ పింక్ డైమండ్ మరో రెండు లెజెండ్ పింక్ డైమండ్ల దృష్టిని ఆకర్షించింది.






