మళ్లీ ప్రత్యక్షమైన పేటీఎం…
ప్రముఖ ఆన్లైన్ చెల్లింపుల యాప్ పేటీఎం మళ్లీ గూగుల్ ప్లే స్టోర్‌లో ప్రత్యక్షమైంది. పేటీఎం యాప్‌లో గ్యాంబ్లింగ్‌కు ప్రోత్సాహం కల్పిస్తున్నారని, ఇది తమ నియమావళికి విరుద్ధమని గూగుల్ ఇంత క్రితం పేర్కొంది. పేటీఎంను, పేటీఎం ఫస్ట్ గేమ్స్ యాప్‌ను ప్లే స్టోర్ తొలగించింది. అయితే, గూగుల్ తమపై నిషేధం తొలగించిందంటూ పేటీఎం ట్వీట్టర్లో వెల్లడించింది. తాజాగా మరో ట్వీట్లో తమ ఆండ్రాయిడ్ యాప్‌ను పునరుద్ధరించామని, ఎప్పట్లాగే గూగుల్‌తో కలిసి పని చేస్తామని పేటీఎం తెలిపింది. యూజర్లకు చెందిన నగదు బ్యాలెన్స్, అనుసంధానమైన ఖాతాలు 100 శాతం సురక్షితంగా ఉన్నాయని, ఈ మేరకు హామీ ఇస్తున్నామని పేర్కొంది. తమ కార్యకలాపాలు పూర్తి స్థాయిలో పున ప్రారంభమయ్యాయని, యూజర్లు గతంలోనూ తమ సేవలు ఆస్వాదించవచ్చని పేటీఎం ట్వీట్ చేసింది.






