టిక్‌టాక్ కొనుగోలు రేసులో ఒరాకిల్
ప్రముఖ క్లౌడ్ కంపెనీ ఒరాకిల్ టిక్‌టాక్‌ను కొనుగోలు రేసులో చేరింది. చైనా వీడియో కంపెనీ బైట్‌డాన్స్‌కు చెందిన టిక్ టాక్ అమెరికా వ్యాపారాన్ని కొనుగోలు చేసేందుకు చర్చలు జరుపుతోంది. ఫైనాన్షియల్ టైమ్స్ నివేదిక ప్రకారం, టిక్‌టాక్ వ్యాపారాన్ని కొనుగోలు చేయడానికి బైట్స్డాన్స్, ఒరాకిల్ మధ్య చర్చల ప్రారంభ దశ కొనసాగుతోంది. యుఎస్, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో టిక్‌టాక్ వ్యాపారం కొనుగోలు చేసేందుకు ఒరాకిల్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇప్పటికే మైక్రోసాఫ్ట్, ట్విటర్లు కూడా టిక్‌టాక్ కొనుగోలు విషయమై చర్చలు జరుపుతున్నాయి. గత వారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టిక్‌టాక్ యుఎస్ వ్యాపారాన్ని అమ్యేందుకు బైట్‌డాన్స్‌కు గడువును 90 రోజులకు పొడిగించారు.






