ఉమెన్స్ డే సందర్భంగా మహిళలకు.. ఎస్బీఐ తీపి కబురు
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) గుడ్ న్యూస్ చెప్పింది. సొంతింటి కలని నిజం చేసుకోవాలనుకునే మహిళలకు తీపి కబురు అందించింది. గృహరుణాలపై ప్రత్యేక తగ్గింపు వడ్డీరేటును మహిళలకు అందించనుంది. హోంలోన్ల వడ్డీ రేటును అదనంగా 5 బేసిస్ పాయింట్లు తగ్గించనున్నట్లు ప్రకటించింది. తాజా సవరణ ద్వారా 6.70 శాతం వద్ద ప్రారంభ వడ్డీ రేట్లతో హోమ్ లోన్స్ ప్రత్యేకంగా మహిళలకు అందుబాటులో తీసుకొస్తున్నట్టు తెలిపింది.
విమెన్స్ డే సందర్భంగా అందిస్తున్న ఈ అవకాశాన్ని మహిళలు వినియోగించుకోవాలని కోరింది. మీ కలల సాథం.. మా లక్ష్యం అంటూ ట్వీట్ చేసింది. అలాగే యోనో యాప్ ద్వారా జరిపే బంగారు, డైమండ్ ఆభరణాల కొనుగోళ్లపై స్పెషల్ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది. 30 శాతం దాకా తగ్గింపును ఆఫర్ చేస్తున్నట్టు ట్వీట్ చేసింది.






