Ola :మస్క్ బాటలో ఓలా సీఈవో … ఉద్యోగులంతా ప్రతి వారం

అమెరికాలో ఫెడరల్ ఉగ్యోగులకు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ గట్టి షాకిచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఓలా (Ola) వ్యవస్థాపకుడు, సీఈఓ భవీశ్ అగర్వాల్ (Bhavish Agarwal) కూడా అదే బాట పట్టారు. తన సంస్థలో పనిచేసే ఉద్యోగులంతా వీక్లీ రిపోర్టులు ఇవ్వాలని కండీషన్ పెట్టారట. దీనికి సంబంధించిన గతవారమే సిబ్బందికి ఇంటర్నల్ మెయిల్ (Mail) పంపినట్లు తెలుస్తోంది. దీనికి క్యా చల్ రహా హై ( ఏం జరుగుతోంది?) అని పేరు పెట్టినట్లు భవీశ్ ఆ మెయిల్‌లో పేర్కొన్నారు. ఉద్యోగులంతా ప్రతి వారం పూర్తి చేసిన పనులు, సాధించిన లక్ష్యాలకు సంబంధించి 3-5 బుల్లెట్ పాయింట్లతో అప్‌డేట్‌లు ఇవ్వాలని సూచించారు. ఈ మెయిల్స్‌ను సంబంధిత విభాగాల మేనేజర్లతో పాటు కంపెనీ ఈమెయిల్ ఐడీ (Company email ID )కి కూడా పంపాలని చెప్పారు. ఇందులో ఎవరికీ ఎలాంటి మినహాయింపులు ఉండబోవని ఆయన చెప్పినట్లు సమాచారం. ప్రతి ఆదివారం (Every Sunday) సాయంత్రం నాటికి ఆ వారమంతా చేసిన పనులపై రిపోర్టులు పంపించాలని భవీశ్ తెలిపారు.