ఫేస్బుక్ కొత్త ఆప్డేట్.. ఇకపై మరింత వేగంగా
ఫేస్బుక్లో వినియోగదారులు వారి మిత్రులు పెట్టే పోస్టులన్నింటినీ వినియోగదారులు మరింత వేగంగా చూసేందుకు సంస్థ స్వల్ప మార్పులతో కొత్త ఆప్డేట్ను తీసుకొచ్చింది. ఇటీవల కాలంలో ప్రపంచవ్యాప్తంగా టిక్‌టాక్ వాడకం ఎక్కువై, ఫేస్బుక్ వినియోగదారులు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో ఫేస్బుక్ తాజా నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి ఈ మార్పులు అందుబాటులోకి రానున్నాయి. ఫేస్బుక్ యాప్‌ను తెరవగానే వివిధ ఆసక్తులకు సంబంధించిన అంశాలకు చెందిన పోస్టులు కనిపిస్తాయి. హోం అని ఉన్న విభాగంలో ఫేస్బుక్ రీల్స్ కనిపిస్తుంటాయి. అయితే ఇటీవల కాలంలో తమ ఫీడ్‌లో తమకు అవసరం లేని అంశాలను కూడా చూపిస్తూ స్నేహితుల పోస్టులు చాలా ఆలస్యంగా చూపించడమో లేక మొత్తానికి చూపించకపోవడమో చేస్తోందంటూ వినియోదారుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఫేస్బుక్ తాజా మార్పుల్ని తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది.






