అమెరికాకు నాట్కో ఫార్మా ఔషధం
కాబాజిటాక్సెల్ అనే జనరిక్ ఔషధాన్ని నాట్కో ఫార్మా అమెరికా విపణికి అందించనుంది. దీనికి అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (యూఎస్ఎఫ్డీఏ) నుంచి అనుమతి వచ్చినట్లు నాట్కో ఫార్మా వెల్లడించింది. ఈ మందును ప్రొస్టేట్ కేన్సర్ చికిత్సలో వినియోగిస్తున్నారు. యూఎస్‌లో నాట్కో ఫార్మా తన భాగస్వామి అయిన బ్రెకెన్రిడ్జ్ ఫార్మాస్యూటికల్తో కలిసి ఈ ఔషధాన్ని విక్రయించనుంది. సనోఫికి చెందిన జెవ్తానా కిట్ అనే బ్రాండుకు ఇది జనరిక్ ఔషధం. యుస్ మార్కెట్లో ఏటా దాదాపు 303 మిలియన్ డాలర్ల అమ్మకాలను ఈ ఈ ఔషధం నమోదు చేస్తోంది.






