అమెరికా పరిశోధకులు కొత్త సాంకేతికత.. 5 నిముషాల్లోనే
విద్యుత్ కారుకు ప్రధాన సమస్య చార్జింగ్ చాలా నెమ్మదిగా కావడం. ప్రస్తుతం విద్యుత్ కార్లు పూర్తిగా చార్జ్ అయ్యేందుకు 20 నిముషాల నుంచి కొన్ని గంటల పాటు సమయాన్ని తీసుకుంటున్నాయి. అయితే రోదసీ యాత్రల కోసం తాము రూపొందించిన ఓ తాజా సాంకేతికత, కేవలం 5 నిమిషాల్లోనే విద్యుత్ వాహనాన్ని (ఈవీ) పూర్తిగా చార్జ్ చేయగలదని అమెరికా అంతరిక్ష సంస్థ నాసా తాజాగా ప్రకటించింది. నాసా భాగస్వామ్యంలో పర్ద్వూ విశ్వవిద్యాలయ పరిశోధకులు, ఈ సాంకేతికను కనిపపెట్టారు. ప్రస్తుతం విద్యుత్ కారు పూర్తి చార్జింగ్కు కనీసం 20 నిమిషాల సమయం పడుతుండగా తాజా సాంకేతికతతో కేవలం 5 నిమిషాల్లోనే పూర్తిగా చార్జ్ చేయవచ్చు. ఇందుకోసం చార్జర్లు 1400 యాంపియర్ల సామర్థ్యంతో పనిచేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం చార్జర్లలో గరిష్ట సామర్థ్యం 520 యాంపియర్లు మాత్రమే. 1400 యాంపియర్ల శక్తితో చార్జ్ చేస్తే వేడి కూడా అదే స్థాయిలో ఉత్పత్తి అవుతుంది. ఆ ఉష్ణోగ్రతలను నియంత్రించే వ్యవస్థ కూడా అవసరమవుతుంది. ఎఫ్బీసీఈ సాంకేతికతను చార్జింగ్‌లో వినియోగించి విజయం సాధించాం. విద్యత్కార్లకు ఉన్న ప్రధాన అడ్డంకి, తాజా ఆవిష్కరణతో తొలగిపోయినట్టే అని పరిశోధకులు తెలిపారు.






