నెపోలియన్‌కు చెందిన అరుదైన వస్తువులు వేలం… ధర ఎంతంటే?

ఐరోపా చరిత్రపై తిరుగులేని ముద్ర వేసిన ఫ్రెంచ్ చక్రవర్తి నెపోలియన్ బోనాపార్టేకు చెందిన అరుదైన వస్తువులు వేలం వేశారు. వీటిల్లో రెండు పిస్తోళ్లు ఉన్నాయి. వీటిల్లో ఒకటి తన ఆత్మహత్యకు వినియోగించాలని నెపోలియన్ భావించాడు. వీటిని వేలం వేయగా 1.69 మిలియన్ యూరోలకు అవి అమ్ముడుపోయాయి. భారత కరెన్సీ ప్రకారం రూ.15 కోట్లు పైమాటే. బ్లూఫౌంటేన్ ప్యాలెస్ పక్కనే ఉన్న ఓసెనాట్ ఆక్షన్ హౌస్‌లో వీటి వేలం జరిగింది. అదే ప్యాలెస్‌లో 1814 ఏప్రిల్ 12వ తేదీన నెపోలియన్ ఆత్మహత్య చేసుకోవాలని భావించారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడిరచారు. నెపోలియన్ వాడిన తుపాకులను లూయిస్ మైరైన్ గోస్సెట్ అనే కంపెనీ తయారు చేసింది. ఆ కంపెనీ ఆశించిన మొత్తం కంటే ఎక్కువే ఈ వేలంలో లభించింది. ప్రాన్స్ ప్రభుత్వం ఈ తుపాకులను జాతీయ సంపదగా ఇటీవలే ప్రకటించింది. ఆ తర్వాతే ఈ వేలం వేయడం గమనార్హం.