బ్రిటిన్ సంపన్నుల జాబితాలో భారతీయుల హవా

బ్రిటన్‍లోని ప్రవాస భారతీయులూ కుబేరులు జాబితాలో తమ సత్తా చాటుతున్నారు. అగశ్రేణి బ్రిటిష్ సంపన్నుల తాజా జాబితాలో రెండు, మూడు స్థానాలు ఆ దేశంలో స్థిరపడిన ప్రవాస భారతీయులకే దక్కాయి. ఇందులో 2,146,5 కోట్ల పౌండ్ల (సుమారు రూ.2.21 లక్షల కోట్లు) నికర ఆస్తులతో ముంబైలో పుట్టి పెరిగిన డేవిడ్, సైమన్ రూబెన్ సోదరులు ఏకంగా రెండో స్థానంలో నిలిచారు. గత ఏడాది రెండో స్థానంలో ఉన్న హిందూజా సోదరులు ఈ సంవత్సరం 1,700 కోట్లు పౌండ్ల ఆస్తులతో మూడో స్థానానికి పడిపోయారు. తర్వాత 1,050 కోట్ల నికర ఆస్తులతో అంతర్జాతీయ స్టీల్ దిగ్గజం ఎల్‍ఎన్ మిట్టల్ ఐదో స్థానంలో నిలిచారు. గత ఏడాది 19వ స్థానంలో ఉన్న మిట్టల్ 750 కోట్ల పౌండ్ల ఆస్తుల వృద్ధితో ఈ ఏడాది ఏకంగా ఐదో స్థానానికి ఎదగడం విశేషం.