గంటకు 90 కోట్ల సంపాదన
ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ (63) మరో ఘనత సాధించారు. దేశీయ కంపనీల్లో అత్యంత విలువైన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) కు చైర్మన్గా వ్యవహరిస్తున్న ముకేశ్.. సంపన్నవంతులైన భారతీయుల జాబితాలో వరుసగా తొమ్మిదో ఏడాది అగ్రస్థానంలో నిలిచారు.
కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు మార్చి నెలలో దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించిన నాటి నుంచి ముకేశ్ అంబానీ ప్రతి గంటకు రూ.90 కోట్ల చొప్పున ఆర్జించడం విశేషం. గత 12 నెలల్లో ముకేశ్ మొత్తం సంపద ఏకంగా 73 శాతం వృద్ధి చెంది రూ.6,58,400 కోట్లకు చేరింది. దీంతో ఆయన భారత్లోనే కాకుండా ఆసియా ఖండంలోని శ్రీమంతుల జాబితాలో అగ్రస్థానంలో.. ప్రపచం అపర కుబేరుల జాబితాలో 4వ స్థానంలో నిలిచినట్టు ఇండియా ఇన్ఫోలైన్ ఫైనాన్స్ లిమిటెడ్ (ఐఐఎఫ్ఎల్) వెల్త్ హురున్ ఇండియా రిచ్ లిస్ట్-2020 వెల్లడించింది.






