ఎలి లిల్లీతో ఎంఎస్ఎన్ ల్యాబ్స్ ఒప్పందం

అమెరికాకు చెందిన ఎలీ లిల్లీ అండ్ కంపెనీతో రాయల్టీ ఫ్రీ, వాలెంటరీ లైసెన్స్ ఒప్పందం చేసుకున్నామని ఎంఎస్‍ఎన్ ల్యాబ్స్ (ఎంఎస్‍ఎన్) ప్రకటించింది. ఈ ఒప్పందంతో కొవిడ్ 19 కోసం దేశంలో బారి సిటినిబ్ ఔషధాన్ని తయారు చేయడంతో పాటుగా మార్కెటింగ్ కూడా చేయనుంది. కరోనా రోగులకు ఆక్సిజన్ అవసరం కావడం, ఎక్స్ట్రాకార్పోరియల్ మెంబ్రేన్ ఆక్సిజనేషన్ (ఎక్మో) చికిత్స పొందుతున్న వారికి రెమిడెసివిర్‍తో పాటు అత్యవసరంగా వినియోగించేందుకు బారిసిటి నిబ్ ఔషధానికి అమనుతిని లభించింది.