2022 వరకూ ఆర్థికం నత్తనడకే : మూడీస్
కోవిడ్ కారణంగా దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థ తిరిగి పట్టాలెక్కాలంటే 2022 లోనే సాధ్యమని మూడీస్ ఇన్వెస్టర్ సంస్థ తెలిపింది. ఇప్పుడు పడుతున్న ఆర్థిక ఇబ్బందులు తాత్కాలికమేనని, ముందటి లాగా పరుగులు పెట్టాలంటే మాత్రం 2022 వరకూ ఆగాల్సిందేనని తేల్చి చెప్పింది. ఎప్పటిలాగే కాకుండా, ఆంక్షలతో నడుస్తున్న రంగాలకు మాత్రం ఈ రిస్క్ కొనసాగుతూనే ఉంటుందని తెలిపింది. చాలా రంగాల ఆర్థిక వ్యవస్థలు ఇంకా కోలుకోలేదని, 2022 వరకూ వేచి చూడాల్సిందేనని ఆ సంస్థ పేర్కొంది. రికవరీ మాత్రం ఒక్కసారిగా ఉండదని, కాస్త హెచ్చ తగ్గులతోనే ఉంటుందని తెలిపింది. మహమ్మారి తగ్గిన తర్వాత కూడా ఆర్థిక కార్యకలాపాల కోసం ప్రభుత్వాలు తగిన సహాయ సహకారాలు అందించాల్సిందేనని సూచించింది.






